ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (16:56 IST)

వేడిగా వున్న తారును బతికున్న కుక్కపై పోసేశారు.. చివరికి?

మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు

మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు ఏమాత్రం కనికరం చూపలేదు.
 
చివరికి ఆ శునకం మృతి చెందింది. బతికున్న శునకంపైనే తారుపోస్తున్నారని స్థానికులు చెప్తున్నా.. కన్‌స్ట్రక్షన్ వర్కర్లు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అయితే మంగళవారం రాత్రి చీకటిలో రోడ్డు నిర్మాణం జరిగిందని.. రోడ్డు పక్కన ఉన్న కుక్కను వర్కర్లు గమనించకపోయి వుండవచ్చునని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే దీనిపై జంతు సంరక్షణ అధికారులు మండిపడుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు పక్కనే శునకపు కాళ్లు వుండిపోయాయని.. కాసేపు బాధతో విలవిల్లాడిన శునకం ఆపై ప్రాణాలు కోల్పోయిందని గోవింద పరాషర్ అనే సామాజిక కార్యకర్త అన్నారు. కానీ ఉదయానికల్లా కుక్క శవం కనిపించలేదన్నారు.