శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (11:38 IST)

ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో సాదర స్వాగతం -రూ.3వేల కోట్ల డీల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సాదర స్వాగతం పలికారు. అంతకుముందు ట్రంప్ గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌లో మహాత్ముని సమాధి వద్ద పుష్ప గుఛ్చాలుంచి శ్రధ్ధాంజలి ఘటించారు. 
 
కాగా- డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రక్షణ, వాణిజ్య సంబంధాలపై ప్రధాని మోదీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ హౌస్‌లో జరగనున్న ఈ చర్చల్లో పలు ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. భారత్‌తో మూడు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రూ.3,000 కోట్ల రక్షణా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.