శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 6 మే 2017 (17:31 IST)

నటి మృతి... ఆ ముగ్గురేరీ? ఆమె కాలు-చేయి ఎందుకు విడిగా వున్నాయ్? తండ్రి ప్రశ్నలు

గురువారం రాత్రి చెన్నై నుంచి బెంగళూరు వెళుతూ 22 ఏళ్ల టీవీ నటి రేఖా సింధు కారు ప్రమాదంలో మరణించిన తీరుపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు కారులో ప్రయాణించి తీవ్ర గాయాలపాలైన ముగ్గురు వ్యక్తులు సంఘటన తర్వాత కనిపించకుండా పోవడంపై ఆయన అనుమానం

గురువారం రాత్రి చెన్నై నుంచి బెంగళూరు వెళుతూ 22 ఏళ్ల టీవీ నటి రేఖా సింధు కారు ప్రమాదంలో మరణించిన తీరుపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు కారులో ప్రయాణించి తీవ్ర గాయాలపాలైన ముగ్గురు వ్యక్తులు సంఘటన తర్వాత కనిపించకుండా పోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె ఆ రోజు ఆడి కారులో ప్రయాణిస్తోందనీ, ఆ కారుకు ప్రమాదం జరిగితే తప్పకుండా బెలూన్లు తెరుచుకుని ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం వుందన్నారు. 
 
అలాంటిది తన కుమార్తె ఆ ప్రమాదంలో చనిపోవడం అనుమానాన్ని కలిగిస్తోందన్నారు. పైగా ఆమె ఒకవేళ కారులోనే ఇరుక్కుపోతే శరీరంపై గాయాలు వుండాలనీ, కానీ ఆమె కాలు-చేయి మాత్రం విడిపోయి వున్నాయనీ, ఈ మరణంపై తనకు అనుమానంగా వుందని తెలిపారు. మరోవైపు ఆమెతో ప్రయాణించిన వ్యక్తులు మాయమవడంపై పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.