మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (11:31 IST)

యువకుడి పొట్టలో రూ.11 కోట్ల విలువచేసే డ్రగ్స్

దేశంలో నిషేధిత మాదకద్రవ్యాలను తరలించేందుకు అనేక మంది వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ దొరికిపోయి జైలుకు వెళ్తున్నారు. పొట్ట‌లో డ్ర‌గ్స్ పెట్టుకుని విమానం ఎక్కి బెంగ‌ళూరు చేరుకున్న ఓ యువ‌కుడిని అధికారులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దుబాయ్‌ నుంచి బెంగ‌ళూరు విమానాశ్ర‌యానికి వ‌చ్చే ఓ ఫ్లైట్ ఎక్కాడు ఆఫ్రికాకు చెందిన ఓ వ్య‌క్తి. అయితే, విమానంలో అత‌డు ఆహారం తిన‌లేదు, పానియాలూ తాగ‌లేదు. దీంతో అత‌డిపై సిబ్బందికి అనుమానం వ‌చ్చింది. బెంగ‌ళూరు విమానాశ్ర‌య అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.
 
విమానం దిగ‌గానే అత‌డిని అదుపులోకి తీసుకున్న అధికారులు స్కాన్ చేయ‌గా అత‌డి పొట్ట‌లో కొకైన్ ఉన్న‌ట్లు తేలింది. ద‌క్షిణాఫ్రికాలోని ఓ డ్ర‌గ్స్ వ్యాపారి త‌మ దేశానికి చెందిన ఓ వ్యక్తిని దుబాయ్ మీదుగా బెంగ‌ళూరుకు పంపించిన‌ట్లు అధికారులు గుర్తించారు. దీనిపై త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతున్నారు.