మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 21 ఆగస్టు 2021 (19:03 IST)

ఏడేళ్లుగా కన్న కుమార్తెపై అత్యాచారం చేస్తున్న తండ్రి

గత ఏడేళ్లుగా తన 17 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని గౌహతి పోలీసులు అరెస్టు చేశారు. తనపై తండ్రి అఘాయిత్యం చేస్తున్న సంగతి చెప్పలేని దయనీయ స్థితిలో వుందా బాలిక.
 
ఐతే వారికి ఇల్లు అద్దెకి ఇచ్చిన యజమానికి అనుమానం రావడంతో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 
 
నిందితుడు తన ఉద్యోగం కారణంగా గౌహతిలోని భట్పారా ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. అతను కోల్‌కతా నివాసి. ఫిర్యాదు నమోదు చేసిన మూడు గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
 
తండ్రిపై పోస్కో చట్టం మరియు ఐపీసి 376 2 (n), 376 (a b) కింద కేసు నమోదు చేశారు.