శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (18:57 IST)

గాంధీ ఆసుపత్రి అత్యాచారం కేసు: ఆ అక్కాచెల్లెళ్లకి కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు, అందుకే...

గాంధీ ఆసుపత్రి అత్యాచారం కేసులో మిస్టరీ ఏమీ లేదని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. అక్కాచెల్లెళ్లిద్దరికీ కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు వుందనీ, ఆసుపత్రిలో వున్న కొద్దిరోజులు ఆ కల్లు తాగకపోయేసరికి ఇద్దరూ ఒత్తిడికి లోనైనట్లు వెల్లడించారు. వాళ్లిద్దరూ ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టే స్థితిలో కూడా లేరని అన్నారు.
 
ఆ రోజు ఆసుపత్రి ప్రాంగణం నుంచి అక్క బయటకు వెళ్లిపోయిందనీ, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన ఆమె చెల్లెలు సెక్యూరిటీ గార్డుతో పరిచయం పెంచుకుందన్నారు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ భవనంలోని 7వ అంతస్తులో లైంగికంగా కలిసారనీ, ఆ తర్వాత మరోసారి సెల్లార్‌లో కలిసారన్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన కారణంగా ఆమె ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు గురించి ఆసుపత్రిలో వున్న 500కి పైగా సీసీ కెమేరాల నుంచి సుమారు 800 గంటల సీసీ ఫుటేజీలను చూసినట్లు సీపీ తెలిపారు.
 
ఈ కేసు చాలా సెన్సిటివ్ కేసు అనీ, ఇలాంటి నేరాల్లో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూదన్న నిబంధనలు వున్నాయన్నారు. కోర్టులో కేసును సబ్మిట్ చేస్తామని తెలిపారు.