శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (17:48 IST)

ఇష్టపూర్వకంగానే నా వెంట వచ్చింది.. గాంధీ ఆస్పత్రి నిందితుడు

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనను పోలీసులు ఛేదించారు. అత్యాచార ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు నిందితుడు విజయ్ ఒప్పుకున్నాడని తెలిపారు. 
 
అత్యాచార ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగానే వెళ్లిందా? లేదా? అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే, తన ఇష్టపూర్వకంగానే ఆమె అతని వెంట వెళ్లినట్లు సమాచారం. 
 
తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. అయితే, అత్యాచారం జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో యువతి తప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.