మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 జూన్ 2025 (11:12 IST)

త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా

jyotiraditya scindia
దేశంలో ఎలాన్ మస్క్‌ స్టార్ లింక్‌కు త్వరలో అనుమతులు జారీ అవుతాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిధియా అన్నారు. స్టార్ లింక్‌కు టెలీ కమ్యూనకేషన్ శాఖ లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తుది అనుమతులు జారీ చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం దేశంలో శాటిలైట్ కనెక్టివిటీ కోసం వన్ వెబ్, రిలయన్స్ సంస్థలకు అనుమతులు ఉన్నాయని, స్టాల్ లింక్‌కు అనుమతులు జారీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని మంత్రి తెలిపారు. త్వరలోనే లైసెన్స్ జారీ అవుతుందని భావిస్తున్నారని ఆయన అన్నారు. 
 
సర్వీస్‌ను పరీక్ష నిమిత్తం వన్‌వెబ్, రిలయన్స్‌కు మినిమల్ ఎక్స్‌ప్లోరేటరీ బేసిస్ ప్రతిపాదకన స్పెక్ట్రమ్ కేటాయింపు జరిగిందని తెలిపారు. స్టార్ లింక్ సైతం ఇదేవిధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఆ తర్వాత కమర్షియల్ కార్యకలాపాల కోసం స్పెక్ట్రమ్స కేటాయింపులకు సంబంధించి విధి విధానాలను ట్రాయ్ జారీ చేస్తుంది మంత్రి వివరించారు. సదూర ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.