అన్నాడీఎంకే ఓ పార్టీ కాదు.. బానిసల గుంపు (స్లేవ్ గ్యాంగ్) : బహిష్కృత ఎంపీ శశికళ ధ్వజం
రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివను చెంపదెబ్బ కొట్టి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే పార్టీపై విరుచుకుపడ
రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివను చెంపదెబ్బ కొట్టి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. అది రాజకీయ పార్టీ కాదనీ, బానిసల గుంపు (స్లేవ్ గ్యాంగ్) అంటూ మండిపడ్డారు.
శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆమెపై తీవ్రమైన ఒత్తిళ్లతో పాటు.. బెదిరింపులు కూడా వస్తున్నాయి. కానీ, ఆమె అవేమీ పట్టించుకోకుండా రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో.. శశికళ పుష్ప భర్త, కుమారుడిపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
ఈ పరిస్థితుల్లో ఆమె అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకే పార్టీని బానిసల గుంపు(స్లేవ్ గ్యాంగ్)గా వర్ణించారు. బానిసల గుంపులో భాగం కావాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తనను వేధిస్తే నాడార్ సామాజిక వర్గం ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు. 'నేను నాడార్ కులానికి చెందిన దాన్ని. భయపడేది లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. నాకు అండగా నా కులం నిలుస్తుంది. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లోని బలమైన కమ్యునిటీల్లో నాడార్ కులం ఒకట'ని పుష్ప అన్నారు.