శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (20:36 IST)

ఇండియాలో భగ్గుమంటున్న పెట్రోలు ధరలు

ఇండియాలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప. తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. 
 
ఇక తాజాగా మరోసారి పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. 
 
ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.04 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 98.42 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.85 చేరగా.. డీజిల్ ధర రూ. 106.62 కు చేరింది. 
 
కోల్‌ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.49 చేరగా.. డీజిల్ ధర రూ. 101.56 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.66 చేరగా.. డీజిల్ ధర రూ. 99.92 కు చేరింది. 
 
ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114. 12 చేరగా.. డీజిల్ ధర రూ. 107. 40 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 116. 27 కాగా డీజిల్‌ ధర రూ. 108. 89 గా నమోదైంది.