శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (23:10 IST)

కరోనాకు బలైన సెలబ్రిటీల జ్యోతిష్యుడు మృతి... రాజీవ్‌ను చంపేస్తారంటూ...

దేశంలోనే సెలబ్రిటీల జ్యోతిష్యుడుగా పేరుగాంచిన బేజన్ దారూవాలా ఇకలేరు. ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. దేశంలోని సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. పైగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురవుతారనీ, అలాగే, నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని చెప్పారు. అలాంటి జ్యోతిష్యుడు ఇపుడు కన్నుమూశారు. 
 
ఈయన తన జ్యోతిషంతో దేశవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసిన దారూవాలా చివరికి కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇటీవలే ఆయన కరోనా పాజిటివ్ రావడంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కొన్నిరోజులుగా దారూవాలాకు వైద్యులు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
 
ఈయన కేవలం సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పడమే కాదు.. జాతీయస్థాయిలో అనేక పత్రికల్లో ఆస్ట్రాలజీ కాలమిస్టుగానూ కొనసాగారు. 'గణేశా స్పీక్స్' అనే శీర్షికతో ఆయన జ్యోతిష శాస్త్ర విషయాలను పాఠకులతో పంచుకునేవారు. ఆయన మొరార్జీ దేశాయ్, వాజ్ పేయి, నరేంద్ర మోడీ వంటి వారు ప్రధాని అవుతారని ముందుగానే చెప్పారు. అంతేకాదు, రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీ ప్రమాదాలపై ముందుగానే ఉప్పందించారు.