లాక్ డౌన్ 5.0, మరో రెండు వారాలు పొడిగించే ఛాన్సుందా?
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తూనే వుంది. లాక్ డౌన్ 5.0 మరో రెండు వారాలు పొడిగించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ లాక్ డౌన్‌ను నాలుగు విడతలుగా కేంద్రం అమలు చేసిన సంగతి తెలిసిందే. అయినా దేశంలో కరోనా తీవ్రత తగ్గట్లేదు.
దీంతో కేంద్రం లాక్ డౌన్ 5.0 ను కూడా అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ 4.0 గడువు మే నెల 31తో ముగుస్తుంది. లాక్ డౌన్ 4లో కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే, లాక్ డౌన్ 5లో కూడా మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, వ్యాయామశాలలు కూడా తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశంలో నమోదవుతున్న 70 శాతం కేసులు కేవలం 11 నగరాల నుంచే వస్తున్నాయని కేంద్రం చెబుతోంది.
కాగా.. మే 30వ తేదీన ప్రధాని మోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ 5పై ప్రధాని ప్రసంగంలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.