బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (14:27 IST)

దమ్ముంటే శ్రీనగర్‌లో భారత జెండాను ఎగురవేయండి చూద్దాం

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కాదు.. దమ్ముంటే శ్రీనగర్‌లో భారత జెండాను ఎగరవేయండి చూద్దాం అని జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సవాల్ విసిరారు. పాకిస్థాన్ ఆక్రమిత

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కాదు.. దమ్ముంటే శ్రీనగర్‌లో భారత జెండాను ఎగరవేయండి చూద్దాం అని జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సవాల్ విసిరారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ అబ్ధుల్లా కేంద్రానికి మరో సవాల్ చేశారు. 
 
కేంద్రానికి దమ్ముంటే శ్రీనగర్ నడిబొడ్డున లాల్‌‍చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేయాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. 
 
ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యలపట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతేగాకుండా ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ ఫైర్ అయ్యారు.

లాల్ చౌక్ సహా రాష్ట్రమంతటా త్రివర్ణ పతాకం ఎగురుతున్న విషయాన్ని ఫరూక్ అబ్ధుల్లా మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను, వేర్పాటు వాదులను ఫరూక్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శ్రీనగర్ ఎంపీ ఫరూక్ అబ్ధుల్లాపై మండిపడ్డారు. 
 
పాకిస్థాన్‌కు ఫరూక్ వత్తాసు పలుకుతున్నార్నారు. మరోవైపు ఫరూక్ అబ్ధుల్లాపై ఢిల్లీకి చెందిన మౌలానా అన్సర్ రజా ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫరూక్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా వున్నాయని.. ఆయనపై విచారణ కోసం అరెస్ట్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రజా పిటిషన్‌ను కోర్టు పక్కనబెట్టింది. భావస్వేచ్ఛ ఉన్న దేశంలో వున్నామని కోర్టు గుర్తు చేసింది. ఈ వ్యవహారంలో కోర్టు కలుగజేసుకోవాలని సూచించింది.