శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (09:59 IST)

పిడకలు తొక్కారనీ దళిత బాలుడి చేతి వేళ్లు తెగ్గోశారు!

పిడకలను పొరపాటున తొక్కిన పాపానికి దళిత బాలుడి చేతి వేలిని తెగ్గోసిన విషాద సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. హరిద్వార్ జిల్లాలోని జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... లక్షర్ ప్రాంతానికి చెందిన ఆర్యన

పిడకలను పొరపాటున తొక్కిన పాపానికి దళిత బాలుడి చేతి వేలిని తెగ్గోసిన విషాద సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. హరిద్వార్ జిల్లాలోని జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... లక్షర్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ అనే దళిత బాలుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆటలాడుకుంటున్న సమయంలో, రమేశ్ కుమార్ అనే 60 యేళ్ల వ్యక్తి ఇంటి ముందు ఆరబెట్టిన పిడకలను తనకు తెలియకుండానే ఆ బాలుడు తొక్కాడు. 
 
దీంతో ఆ వృద్ధుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి బాలుడి ఎడమ చేతి చిటికిన వేలును కట్ చేసి పారేశాడు. బాలుడి తండ్రి రోహ్‌తస్ కుమార్ ఫిర్యాదు మేరకు, రమేశ్ కుమార్‌తో పాటు అతని కొడుకు షుభమ్‌పై పోలీసులు కేసునమోదు చేశారు.