ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (14:41 IST)

ఒకడు కన్నబిడ్డ నగ్న వీడియో కావాలన్నాడు.. మరో తండ్రి స్నానం చేస్తుంటే వీడియో తీసేశాడు..

మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి వృద్ధుల వరకు వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఇదే తరహాలో కన్నకుమార్తెల పైనే తండ్రులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే

మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి వృద్ధుల వరకు వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఇదే తరహాలో కన్నకుమార్తెల పైనే తండ్రులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. 41 ఏళ్ల వయస్సున్న ఓ తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడు. 16 ఏళ్ల కుమార్తెను ఆమె నగ్న దృశ్యాలను వీడియో తీసి పంపాల్సిందిగా ఒత్తిడి చేశాడు. 
 
ఇందుకు ఆ బాలిక అంగీకరించలేదు. ఇంకా తన మేనమామ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా పంజాబ్ పోలీసులు బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. ఆపై అతనిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.. 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలో వుంచారు. ఈ ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తున్న తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. తండ్రి అనే మాటకు మలేషియా వ్యక్తి మచ్చ తెచ్చాడు. 48 ఏళ్ల మలేషియా వ్యక్తి.. తన కుమార్తె నగ్న దృశ్యాలను ఫోనులో రికార్డ్ చేశాడు. తన బిడ్డ స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లో సెల్‌ఫోన్‌ను వుంచి ఈ తతంగాన్ని రికార్డు చేస్తున్నాడు. ఈ విషయాన్ని తన 21 ఏళ్ల కుమార్తె పసిగట్టింది. 
 
రికార్డింగ్ అవుతున్న ఫోనును కనిపెట్టి.. అందులోని వీడియోలను చూసి షాక్ అయ్యింది. తన నగ్న దృశ్యాలను తన తండ్రి రికార్డ్ చేస్తున్నాడని తెలిసి.. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన 2016 జూలైలో జరిగినా... ఈ కేసులో ఆ తండ్రికి నాలుగు నెలల జైలు శిక్ష పడింది.