శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (09:53 IST)

షీనాబోరా మర్డర్ ప్లాన్ విని జడుసుకున్నా: ఇంద్రాణి డ్రైవర్

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి డ్రైవర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. షీనాబోరా మర్డర్ కేసు ప్లాన్ విని జడుసుకున్నానని ఆ కేసు విచారణలో న్యాయమూర్తికి అప్రూవర

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి డ్రైవర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. షీనాబోరా మర్డర్ కేసు ప్లాన్ విని జడుసుకున్నానని ఆ కేసు విచారణలో న్యాయమూర్తికి అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ తెలిపాడు. ఈ హత్యలో తాను భాగమైనందుకు ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదన్నాడు.
 
2012 స్కైప్‌లో ఇంద్రాణి.. షీనాబోరా హత్య గురించి ఐదారు సార్లు మాట్లాడిందని శ్యామ్ వర్ రాయ్ చెప్పాడు. అతని వద్ద సెప్టెంబర్ నాలుగో తేదీ వరకు విచారణ జరుగనుంది. 2012లో షీనా బోరా హత్య జరిగింది. 2015 ఆగస్టులో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
 
కాగా, ఇంద్రాణి ముఖర్జీ తన కన్న కూతురు షీనా బోరాను మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టకుండా కాల్చేసి రాయగఢ్ జిల్లాలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పడవేశారు. హత్యోదంతం బయట పడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తర్వాత కాలంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి విదితమే.