బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (09:47 IST)

ఎయిమ్స్ ఆస్పత్రి స్టోర్ రూమ్‌లో అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) స్టోర్ రూములో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు వెళ్లి మంటలను ఆర్పివేశారు. 
 
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్టు ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఆదివారం జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో కాశ్మీర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషనుపై పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు డ్రోన్ల సాయంతో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడికి సంబంధించి భారీగా పేలుడు పదార్థాలు కలిసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.