శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (12:39 IST)

ఓఎన్జీసీలో భారీ అగ్నిప్రమాదం... ఐదుగురి సజీవదహనం?

మంగళవారం ఉదయం ఉరాన్ సమీపంలోని గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో శీతల గిడ్డంగిలోని కోట్లాది రూపాయల విలువైన యంత్ర సామగ్రి, ఇతర ఉపకరణాలు, ముడి చమురు దగ్ధమయ్యాయి.
 
ఈ అగ్నిప్రమాద వార్త తెలుసుకునన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం చమురు శుద్ధి కర్మాగారం పరిధిలో ఉండటంతో, తగు జాగ్రత్తలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఈ అగ్నిప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించివుండవచ్చని, ఘటనపై విచారణను జరుపుతామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి నష్టం సంభవించింది.