గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (20:11 IST)

ఆర్మీ వాహ‌నంలో మంట‌లు- నలుగురు జవాన్లు సజీవ దహనం

indian army
జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలో నలుగురు జవాన్లు సజీవ దహనం అయ్యారు. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆర్మీ వాహ‌నంలో మంట‌లు చెల‌రేగడంతో ఈ ఘోరం జరిగిపోయింది. ఈ వాహ‌నం పూంచ్ - జమ్మూ హైవేపై వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని అధికారులు తెలిపారు.
 
జవాన్లతో వెళ్తున్న వాహనం పూంచ్ జిల్లా తోటగలి గ్రామ సమీపంలో రాగానే ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. 
 
తప్పించుకునే వీలులేకపోవడంతో నలుగురు జవాన్లు బండిలోనే చిక్కుకున్నారు. సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్, ఆర్మీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.