ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (18:03 IST)

చికెన్ పకోడా కావాలన్న చిన్నారి.. చంపేసిన బంధువు.. ఎక్కడ?

చికెన్ పకోడీ కావాలని పట్టుబట్టిన ఓ చిన్నారిని ఓ తాగుబోతు కొట్టి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరుకు సమీపంలో వెల్లవేడు వద్ద ఒడిస్సాకు చెందిన అమీర్ అనే వ్యక్తి తన భార్య, నాలుగేళ్ల చిన్నారితో నివసిస్తున్నాడు. ఆదివారం పూట అమీర్ బంధువు నీలక్కర్‌తో బయటికి వెళ్లిన నాలుగేళ్ల కుమార్తె కనిపించలేదు. 
 
కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లిన అమీర్‌కు మద్యం మత్తులో వున్న నీలక్కర్ కనిపించాడు. అయితే వద్ద తన కుమార్తె గురించి అడిగాడు. కానీ అతడు మద్యం మత్తులో మాట్లాడేది అర్థం కాలేదు. సోమవారం ఉదయం అమీర్ కుమార్తె మృతదేహమే కనిపించింది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నీలక్కర్‌ను అరెస్ట్ చేశారు. 
 
విచారణలో నీలక్కర్ చిన్నారి కొట్టి చంపేసినట్లు తేలింది. పోలీసులకు అతనిచ్చిన వాంగ్మూలంలో చిన్నారిని తనతో వెంటబెట్టుకుని మద్యం షాపుకు వెళ్లానని..అక్కడ ఫూటుగా తాగి తిరిగి వస్తుండగా.. చికెన్ పకోడా తీసుకుని తింటూ కూర్చున్నానని.. దాన్ని చూసిన ఆ చిన్నారి చికెన్ పకోడా కావాలని పట్టుబట్టినట్లు తెలిపాడు. దీంతో ఆవేశానికి గురైన అతడు చిన్నారిని కొట్టి చంపేసినట్లు ఒప్పుకున్నాడు.