శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (15:26 IST)

భార్య ఓ ప్రశ్న అడిగింది... ముక్కు కొరికిపారేసిన భర్త...

భార్య ఓ ప్రశ్న అడిగింది. అంతే ఆవేశంతో భర్త ఆమె ముక్కు కొరికిపారేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  గుజరాత్, గోటాసర్ ప్రాంతానికి చెందిన రేష్మా గుల్వానీ (40) ఆ ప్రాంతంలో ఓ షాపులో పనిచేస్తుంది. ఈమె భర్త కైలాష్ కుమార్. ఈ దంపతులను ముగ్గురు సంతానం వున్నారు. కైలాష్ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే వున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రేష్మ తన పర్సులో పెట్టిన మూడువేల రూపాయలు కనిపించలేదని భర్తను అడిగింది. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగులాట ఏర్పడింది. దీంతో ఆగ్రహానికి గురైన కైలాష్.. భార్యపై దాడి చేయడంతో పాటు ఆమె ముక్కును కొరికేశాడు. 
 
తీవ్రగాయపడిన రేష్మను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కైలాష్‌ను అరెస్ట్ చేశారు. రేష్మ ముక్కుకు 15 కట్లు పడినట్లు వైద్యులు తెలిపారు.