ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మే 2024 (12:56 IST)

ముంబైలో భారీ వర్షం, గాలుల బీభత్సం.. బిల్‌బోర్డ్ పడి 14మంది మృతి

billboard
billboard
ముంబైలో భారీ వర్షం కారణంగా 14మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం, దుమ్ముధూళితో కూడిన తుఫాను కారణంగా భారీ బిల్‌బోర్డ్ పడిపోయిన ఘటనలో ఈ 14మంది మృతి చెందారు. అలాగే  దాదాపు 74 మంది గాయపడ్డారు. 
 
సోమవారం గంటపాటు కురిసిన తుపాను ధాటికి ఘట్‌కోపర్‌లోని పంత్‌నగర్‌లో ఎత్తైన బిల్‌బోర్డ్ కూలిపోయింది. ఇది కూలి పెట్రోలు పంపుపై పడింది. సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్సులు, భారీ క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో సహాయకు చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి.
 
అలాగే వడాలాలో ఓ హోర్డింగ్ కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ హోర్డింగ్ చట్టవిరుద్ధమని వార్తలు వస్తున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గరిష్టంగా 40 చదరపు అడుగుల హోర్డింగ్‌ను అనుమతించగా, కూలిపోయిన బిల్‌బోర్డ్ 120 చదరపు అడుగుల పరిమాణంలో మూడు రెట్లు ఉన్నట్లు ముంబై మీడియా సంస్థలు తెలిపాయి. 
 
ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని, హోర్డింగ్‌లన్నింటినీ వెంటనే తొలగించాలని కోరుతూ స్థానిక వార్డు కార్యాలయం సదరు సంస్థకు 10 రోజుల సమయం ఇచ్చినట్లు ఓ ముంబై వార్తా సంస్థ వెల్లడించింది. ముంబై, థానేలలో అకాల వర్షాల కారణంగా విద్యుత్‌కు అంతరాయం కలిగింది. ఇంకా ట్రాఫిక్‌ ఏర్పడింది.