మరింత పెరిగిన ముడి చమురు ధరలు, మండుతున్న పెట్రోల్ ధరలు
దేశంలో ముడి చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 25 పైసలకు చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.45లకు చేరువై..రికార్డును సృష్టించింది.
ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. ఇక లీటరు డీజిల్ ధర రూ. 75.63గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.91.80 ఉండగా, డీజిల్ ధర రూ.82.13గా ఉంది.
అంతర్జాతీయంగా బారెల్ చమురు ధర పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉండటం వల్ల ముడి చమురు ధర పెరిగింది.