మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (08:53 IST)

తమిళనాడు ముఖ్యమంత్రిగా చిన్నమ్మకు బాధ్యతలు?

తమిళనాడు ముఖ్యమంత్రిగా దివంగత సీఎం జయలలిత ఇష్టసఖి శశికళ బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై విడుదల చేసిన పత్రికా ప్రకటనతో తేలిపోయింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా దివంగత సీఎం జయలలిత ఇష్టసఖి శశికళ బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై విడుదల చేసిన పత్రికా ప్రకటనతో తేలిపోయింది. ‘‘శశికళ వీలైనంత త్వరగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలన్నదే నాలాంటి సగటు పార్టీ కార్యకర్త అభిప్రాయం!’’ అని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే శశికళ పార్టీ అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. 
 
ఈ పరిస్థితుల్లో శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు పోయస్ గార్డెన్ వేదికగా జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకేలో తదుపరి ఏమి జరుగుతుందనే విషయం అంతుబట్టకుండా అంతా గుంభనంగా సాగుతోంది. శశికళ ఏం చేస్తున్నారంటూ.. నేతలు సైతం ఆరా తీస్తున్నారు. కానీ ఎవరూ ఏమీ చెప్పడం లేదు. శశికళ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఎప్పటికప్పుడు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అసలు శశికళలో ఇంతటి ప్రతిభ ఉందా.. అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
ఈ ఆశ్చర్యం నుంచి అందరూ తేరుకునే లోపే శశికళ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారన్న వార్తలు సోమవారం పోయెస్‌గార్డెన్‌ పరిసరాల్లో హల్‌చల్‌ చేశాయి. ఈ దిశగా ఆమె పావులు కదుపుతున్నారని, అందుకే నాలుగో తేదీ నుంచి జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారని చెబుతున్నారు. శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు అన్నాడీఎంకేలోని ఓ ప్రధానవర్గం కొన్ని రోజులుగా ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం.