శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By preeti
Last Modified: బుధవారం, 2 ఆగస్టు 2017 (16:21 IST)

గ్యాంగ్ రేప్ బాధితురాలు 27 రోజుల బతుకు పోరాటం... చివరికి...

కోల్‌కతాలో ఒక చిన్న రెస్టారెంట్ నడుపుకుంటున్న 62 ఏళ్ల మహిళపై కొందరు కామాంధులు అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. కొంతమంది రౌడీలు ఆ రెస్టారెంట్ వెనుక మద్యం సేవిస్తుండగా బాధితురాలు వారితో వాగ్వివాదానికి దిగింది. దీనితో కోపోద్రిక్తులైన ఆ రౌడీలు బ

కోల్‌కతాలో ఒక చిన్న రెస్టారెంట్ నడుపుకుంటున్న 62 ఏళ్ల మహిళపై కొందరు కామాంధులు అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. కొంతమంది రౌడీలు ఆ రెస్టారెంట్ వెనుక మద్యం సేవిస్తుండగా బాధితురాలు వారితో వాగ్వివాదానికి దిగింది. దీనితో కోపోద్రిక్తులైన ఆ రౌడీలు బాధితురాలిని బందీగా చేసుకుని ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతటితో ఆగకుండా ఎంతో పైశాచికంగా ఆమె మర్మాంగాలలో బీరు బాటిళ్లు, తదితర వస్తువులను చొప్పించారు. బాధితురాలిని ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె నుండి వాంగ్మూలం తీసుకుని, దాని ఆధారంగా రాజేశ్వర్ మైటీ అనే ప్రధాన నిందితుడిని అరెస్టు చేసారు. ఎన్ఆర్ఎస్ ఆసుపత్రి వైద్యులు సైతం గాయాలను పరిశీలించాక దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధితురాలు గత 27 రోజులుగా మృత్యువుతో పోరాడి బుధవారం ఉదయం కన్నుమూసింది.