సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (12:02 IST)

బ్రహ్మచారిగా ఉండటం చాలా కష్టం.. అన్నా హజారే

దేశంలోని పెళ్లికాని ప్రసాదులకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఓ విజ్ఞప్తి చేశారు. బ్రహ్మచారిగా ఉండటం చాలా కష్టమని, అందువల్ల ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు.

దేశంలోని పెళ్లికాని ప్రసాదులకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఓ విజ్ఞప్తి చేశారు. బ్రహ్మచారిగా ఉండటం చాలా కష్టమని, అందువల్ల ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. 
 
తాజాగా ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, తనలా ఎవరూ బ్రహ్మచారిగా మిగిలిపోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని ఆయన అభిలషించారు. బ్రహ్మచారిగా ఉండటం సులువు కాదని తెలిపారు. పదునైన కత్తిపై నడవడంకంటే బ్రహ్మచారిగా ఉండడం చాలా కష్టమని చెప్పారు.
 
పెళ్లి చేసుకోకుండా సమాజం కోసం జీవితాన్ని అంకితం చేయాలని పాతికేళ్ల వయసులో తాను నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. విశ్వామిత్ర మహర్షి అంతటివాడే వేల ఏళ్ల పాటు తపస్సునాచరించి మేనక కారణంగా చలించిపోయాడని అన్నారు. మనసు చంచలమైనదని ఆయన తెలిపారు. తానెవరికీ వివాహం చేసుకోవద్దని చెప్పలేదన్నారు. అందువల్ల ప్రతి బ్రహ్మచారి పెళ్ళి చేసుకోవాలని సలహా ఇచ్చారు.