బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (06:31 IST)

ఛత్తీస్‌ఘర్‌లో కుక్కలకూ బహుమతి

ఛత్తీస్‌ఘర్‌లో రాయగర్‌ జిల్లాలో చేసే మంచి పనులకు పోలీసులకు 'కాప్‌ ఆఫ్‌ ది మన్త్‌' అవార్డుతో ఎస్‌పి ప్రోత్సహిస్తారు. కేవలం అవార్డుమాత్రమే కాకుండా.. వారికి కొంత డబ్బుతోపాటు, అవార్డుపొందిన వారి ఫొటోస్‌ను కూడా వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో ఉంచుతారు.

ఇలా ఈసారి ఇద్దరు పోలీసులతోపాటు, దొంగల్ని పట్టుకునే జాగిలంకు కూడా ఎస్‌పి సంతోష్‌ సింగ్‌ కాప్‌ ఆఫ్‌ ది మన్త్‌ అవార్డునిచ్చారు. ఈ ఇద్దరు పోలీసుల్లో ఒకరు చట్టపరమైన విభాగానికి చెందినవారు కాగా, మరొకరు డాగ్‌ హ్యాండ్లర్‌ వీరేంద్రకు అవార్డునిచ్చారు.

ప్రత్యేకించి జాగిలంకు అవార్డు ఇవ్వడాని గల కారణమేమిటంటే.. సారన్‌గర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సారన్‌గర్‌ రాజ్‌మహల్‌లో ఆరు లక్షల ఖరీదైన రెండు వెండి ట్రేలు దొంగిలించబడ్డాయట!

వాటిని ట్రాకర్‌ డాగ్‌ సహాయంతో వీరేంద్ర నిందితులను పట్టుకొని, వెండి ట్రేలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ట్రాకర్‌ డాగ్‌ చేసిన సహాయానికి అవార్డునిచ్చామని సంతోష్‌ సింగ్‌ విలేకరులకు తెలిపారు.