గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (11:11 IST)

ఒక్క రోజులో 80 లీటర్ల పాలిచ్చిన ఆవు

milk
హర్యానా రాష్ట్రంలో ఓ ఆవు ఏకంగా 80 లీటర్ల పాలిచ్చింది. ఇది సరికొత్త రికార్డు. కురుక్షేత్రలో నిర్వహించిన ఈ పోటీల్లో షకీరా అనే ఆవు 24 గంటల్లో 80 లీటర్ల పాలు ఇచ్చింది. కర్నాల్ జిల్లాలోని ఝుఝూరీకి చెందిన సునీల్, శాంకీ అనే ఇద్దరు సోదరులు ఈ ఆవును పెంచుతున్నారు. పోటీల్లో భాగంగా, 8 గంటల విరామ ఇస్తూ రోజులో మూడుసార్లు యంత్రాల ద్వారా ఆవుకు పాలు పితికారు. మొత్తం 80 లీటర్ల పాలను ఇచ్చింది.