మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

జంకూగొంకూ లేకుండా పబ్లిగ్గా ఢిల్లీ మెట్రోలో ముద్దులు...

ఢిల్లీ మెట్రో రైళ్లు ఇపుడు ప్రేమికులకు అడ్డాగా మారిపోతున్నాయి. తమతో పాటు ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా కొందరు ప్రేమికులు మరిచిపోతున్నారు. ఫలితంగా ఏమాత్రం జంకూగొంకూ లేకుండా పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమజంట ప్రవర్తించిన తీరును ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల నాలుగో తేదీన ఢిల్లీ మెట్రోలో ఓ ప్రేమ జంట ప్రయాణికులంతా చూస్తుండగానే ప్రేమకలాపంలో మునిగిపోయింది. జంకూ గొంకూ లేకుండా పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ వారు ప్రవర్తించిన తీరుతో తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. 
 
సదరు జంట బహిరంగంగా సాగించిన ఈ వ్యవహారాన్ని తోటి ప్రయాణికుడొకరు తన మొబైల్ కెమెరాలో బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు యువజంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై పోలీస్ కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.