11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ఆధార్ కార్డును పరిశీలిస్తూ..?

సెల్వి| Last Updated: శుక్రవారం, 1 నవంబరు 2019 (11:33 IST)
11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పరిధిలో ఉన్న కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌లో ఇంతిజార్‌ అలీ అనే ఓ స్కూల్ ప్రిన్సిపాల్ 11ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

బాధిత బాలిక స్థానిక ఉండే ఓ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. అయితే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల స్కూల్ ఫీజు చెల్లించలేదు. దీంతో ప్రిన్సిపాల్ బాలికను పరీక్షలకు అనుమతించలేదు. కానీ ఆధార్ కార్డును తెస్తే పరీక్ష రాయిస్తానన్నాడు.

సాయంత్రం సమయంలో ఆధార్ కార్డు పరిశీలించేందుకు బాలికను పిలిచాడు. కార్డును పరిశీలిస్తున్నట్టు నటించి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :