శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 31 అక్టోబరు 2019 (15:45 IST)

హైదరాబాద్‌లో దారుణం.. బతికున్న శిశువును పూడ్చిపెట్టే యత్నం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రాణాలతో ఉన్న శిశువుని పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు కొందరు కిరాతకులు. తమ మనవరాలు చనిపోవడంతో పూడ్చిపెట్టడానికి వెళుతున్నామని అక్కడున్న ఆటో డ్రైవరుకు చెప్పడంతో పాపను పరికించి చూశాడు ఆటో డ్రైవరు. 
 
అయితే ఆ పాప చేతులు కాళ్లు కదపడం. గుక్క పెట్టి ఏడ్వటంతో ఆటోడ్రైవరుకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
శిశువుని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. అసలు పసిపాపను బ్రతికుండగానే ఎందుకు పూడ్చిపెట్టాలని అనుకున్నారు. అసలు ఈ కిరాతకులు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.