శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (14:00 IST)

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం: నలుగురి అరెస్ట్

కామాంధులు రెచ్చిపోతున్నారు. మహారాష్ట్ర నాగ్​పుర్​లో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలికపై కామాంధులు విరుచుకుపడ్డారు. బాలిక ప్రియుడు సహా అతని స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అనంతరం మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులూ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధిత యువతి, ఆకాశ్​ భండారీ అనే యవకుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. 
 
అక్టోబర్​ 2 నుంచి 7 మధ్య ఆకాశ్​తో పాటు అతని స్నేహితులు సందీప్​, ఫిరోజ్ ఖాన్​, అజయ్​ సురంకర్ యువతిపై నాగ్​పుర్ నగర శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.