మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:14 IST)

బాలికను కిడ్నాప్ చేసి.. మత్తుమందిచ్చి రేప్ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు. స్పృహ వచ్చిన తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి ఊరు సమీపంలో వదిలిపెట్టి ఆ కామాంధులు పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో కొందరు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందిచ్చి 2 గంటల పాటు అత్యాచారం చేశారు. అత్యాచారం అనంతరం దుండగులు స్పృహ కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాలిక కనిపించడం లేదని వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించింది. 
 
వారికి జరిగిన విషయం చెప్పింది. పైగా, తనపై అత్యాచారానికి పాల్పడింది తమ ఊరి వారేనని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుల కోసం గాలిస్తున్నారు.