పెంపుడు కుక్కపై కత్తి పెట్టి... యజమాని కూతురు బట్టలు విప్పమన్న డ్రైవర్
యజమాని కూతురినే లైంగికంగా వేధించడంతో పాటు తను చెప్పినట్లు చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ బాలికను బెదిరిస్తున్న డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
యజమాని కూతురినే లైంగికంగా వేధించడంతో పాటు తను చెప్పినట్లు చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ బాలికను బెదిరిస్తున్న డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు ఓ సాప్ట్వేర్ ఇంజినీర్.
రెండేండ్లుగా ఆ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు షేక్ ఇస్మాయిల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్తె ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. బాలిక ఓంటరిగా ఉన్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఇస్మాయిల్. ఇటీవల బాలిక కాలేజ్ నుంచి కారులో ఒంటరిగా వస్తున్న సమయంలో డ్రైవర్ ఇస్మాయిల్ ఓ చీకటి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా బాలిక గట్టిగా కేకలు వేయడంతో వదిలేశాడు. అయితే జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తా అంటూ బెదిరించాడు.
బాలికకు వీడియో కాల్ చేసి ఆమె పెంపుడు కుక్కపిల్ల మెడపై కత్తి పెట్టి బట్టలు తీయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఇస్మాయిల్ చెప్పినట్లు చేసింది. ఈ వీడియోను రికార్డు చేసిన ఇస్మాయిల్ తాను చెప్పినట్లు చేయాలని లేదంటే సోషల్ మీడియాలో ఆ వీడియో పెడతానని బెదిరిండాడు.
అయితే కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురికావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిపై, నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.