శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 జులై 2017 (11:53 IST)

అసహజప్రవర్తన భరించలేక చీకటి గదిలో పెట్టి తాళం వేశారు.. 20 యేళ్లుగా బందీ

పెళ్లితో ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్త నిజస్వరూపం తెలుసుకున్న ఆమె అయినవారి వద్దకు వచ్చింది. కానీ, ఓదార్చాల్సిన అయినవారే చీదరించుకున్నారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఆమె అసహజ ప్రవర్తనను కుటుంబ స

పెళ్లితో ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్త నిజస్వరూపం తెలుసుకున్న ఆమె అయినవారి వద్దకు వచ్చింది. కానీ, ఓదార్చాల్సిన అయినవారే చీదరించుకున్నారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఆమె అసహజ ప్రవర్తనను కుటుంబ సభ్యులు భరించలేక ఓ చీకటి గదిలోపెట్టి తాళం వేశారు. ఆతర్వాత ఆ గదిలోనే ఆమె 20 సంవత్సరాలు గడుపుతూ వస్తోంది. గోవాలో వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదాకర సంఘటనలు ఇలా ఉన్నాయి.
 
గోవాకు చెందిన ఓ యువతి ముంబైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అత్తారింటికి వెళ్లాకగానీ ఆ వ్యక్తికి పెళ్లై భార్య ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆమె హృదయం ముక్కలైపోయింది. తన ఆశలన్నీ నీరుగారిపోయాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ముంబై నుంచి గోవాలోని పుట్టింటికి వచ్చింది. 
 
ఆదుకుంటారని ఆశగా తిరిగి ఇంటికి రాగా ఓదార్చడం, ఆదుకోవడం అటుంచి కుటుంబ సభ్యుల ప్రవర్తనతో ఆమె జీవితమే అందకారమైంది. అంతే ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మతిస్థిమితం కోల్పోయి కుటుంబ సభ్యులతోనే అసజహంగా ప్రవర్తించసాగింది. 
 
దీన్ని భరించలేని కుటుంబ సభ్యులు ఆమెను ఓ చీకటి గదిలోపెట్టి తాళం వేశారు. ఆ తర్వాత ఆ గదిలోనే ఆమె 20 సంవత్సరాలు గడిపింది. బయట ప్రపంచంతో ఆమె సంబంధం గదికి ఉన్న ఒకేఒక్క కిటికియే. దాని ద్వారానే ఆమెకు నీళ్లు, ఆహారం అందించేవారు. 
 
ఈ బందీ ఘటన మహిళల హక్కుల కోసం పనిచేసే పౌర బృందం బైలాంచో సాద్‌కు తెలిసింది. ఈ బృందం సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు మహిళా పోలీసులు ఇంటిపై రైడ్‌చేసి బాధిత మహిళను రక్షించారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల వాదనలు రికార్డు చేసినట్లు పేర్కొన్నారు.