ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (12:56 IST)

పట్టాలు తప్పిన గూడ్స్... అదే ఒడిశాలో.. ఎవరికి ఏమైంది?

Goods Train
Goods Train
బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. ఒడిశాలోనే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. 
 
జార్ఖండ్ జిల్లాలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. లైమ్ స్టోన్‌ను మోసుకెళ్తున్న రైలు డుంగురి నుంచి బార్ఘాడ్ వెళ్తుండగా మెందపల్లి సమీపంలో పట్టాలు తప్పింది. 
 
ఈ ఘటనతో పలు వేగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో  275 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.