శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (13:03 IST)

రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరం.. ఎక్కడ?

Leopard
రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరాన్ని గుర్తించారు రైల్వే అధికారులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని వనీ బొగ్గు గని క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గుగ్గూస్ రైల్వే సైడింగ్ వద్ద నిలిచి వున్న రైలు ఇంజిన్‌పై చిరుత క‌ళేబ‌రాన్ని గుర్తించారు రైల్వే అధికారులు. దాంతో రైల్వే అధికారి రాజేశ్ సింగ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అటవీ అధికారులకు తెలియజేశారు. 
 
చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు పరీక్షల కోసం చంద్రపూర్ తరలించారు. రైలు ఇంజిన్ పైనుంచి దూకబోయిన చిరుత హైటెన్షన్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.