శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (22:08 IST)

కోడికి ఆశపడి ఓ వ్యక్తి పులి బోనులో ఇరుక్కుపోయాడు..

Leopard
కోడికి ఆశపడి ఓ వ్యక్తి పులి బోనులో ఇరుక్కుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. యూపీలో పులి బోనులోని కోడిని దొంగలించేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే అక్కడ పులి లేదు. 
 
బులంద్‌షహర్‌ జిల్లాలో గ్రామంలో ఒక చిరుత పులి ఒక చిరుత సంచరిస్తుండగా దాన్ని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో బోనును అధికారులు ఏర్పాటు చేసారు. ఆ బోనులో కోడిని వుంచారు. కోడి కోసం పులి వస్తే బోనులో చిక్కుకుంటుందని ప్లాన్ వేశారు. 
 
కానీ కోడి కోసం పులి రాలేదు. వచ్చిన దొంగ ఆ బోనులో చిక్కుకుపోయాడు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా బోను లోనికి వెళ్లి కోడి మెడను పట్టేశాడు. ఇక ఆనందంలో బయటకు రావడానికి ప్రయత్నించగా వీలుపడలేదు. బోను తలుపు మూసుకుపోవడంతో అందులోనే ఉండిపోయాడు. కాపాడాలని గోల చేశాడు. 
 
చివరికి స్థానికుల సమాచారం ప్రకారం మరుసటి రోజు ఉదయం అధికారులు ఆ బోనును రిలీజ్ చేశారు. కోడిని దొంగలించేందుకే బోనులోకి వెళ్లినట్లు దొంగ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.