గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:43 IST)

నెల్లూరులో ర్యాగింగ్ భూతం.. రైలుకిందపడి విద్యార్థి ఆత్మహత్య

suicide
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కడనూతలలో ఉన్న ప్రైవేటు ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సాటి విద్యార్థుల ర్యాగింగ్ భరించలేక ఆ విద్యార్థి రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి ప్రదీప్ వేగంగా వస్తున్న రైలు కింద పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
తన కుమారుడి మృతిపై తల్లిదండ్రులు స్పందిస్తూ, తన రూమ్‌మేట్‌ల వేధింపులను తమతో పాటు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారని చెప్పాడు. దీంతో టీసీ ఇవ్వాలని లేదా ర్యాగింగ్‌‍కు పాల్పడుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని వారు బోరున విలపిస్తూ చెప్పారు. 
 
ఈ ఘటనపై విద్యార్థులు, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ సంస్కృతికి స్వస్తి పలకాలంటూ వారు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.