శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. షాక్‌లో వార్డెన్ మృతి

suicide
నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన షాక్‌కు గురైన హాస్టల్ వార్డెన్ గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాట్టు ఇతర విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అదించారు. ఈ మాటలు వినగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా పులివెందులకు చెందిన ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థులు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలిపారు. దాంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ రెండు మరణాలతో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.