మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 ఏప్రియల్ 2022 (16:12 IST)

స్నేహితుడి భార్యపై కన్నేసాడు, అర్థరాత్రి వేళ ఆమెపై....

స్నేహితుడే తన భార్య పాలిట కామాంధుడవుతాడని అతడు ఊహించలేకపోయాడు. స్నేహంగా వుంటూనే తన భార్యపై కన్నేసి... ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

 
ఏపీ గూడూరు రూరల్ మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. చవటపాళెంకి చెందిన హరికుట్టి అదే ప్రాంతంలో వుండే వ్యక్తితో స్నేహం సాగిస్తున్నాడు. అలా కొన్నిరోజులుగా అతడితో స్నేహం పెంచుకుని, అతడి భార్యపై కన్నేసాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. ఆమె అతడిని పట్టించుకోకపోవడంతో వేరే ప్లాన్ వేసాడు.

 
అర్థరాత్రి వేళ తన స్నేహితుడు ఇంట్లో లేడన్న విషయాన్ని నిర్థారించుకుని పిల్లలతో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య తలపై ఇనుప రాడ్డుతో మోదాడు. ఆ దెబ్బకి ఆమె స్పృహ తప్పిపడిపోయింది. దాంతో ఆమెను సమీపంలోని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఉదయం తేరుకున్న బాధితురాలు తనపై జరిగిన దాడిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి నిందితుడి కోసం గాలిస్తున్నారు.