1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (22:33 IST)

గూడురులో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య... వార్డెన్ కూడా మృతి

suicide
తిరుపతి జిల్లా గూడూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం విన్న వార్డెన్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజి హాస్టల్‌లో ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. 
 
ఈ విషయాన్ని ఇతర విద్యార్థులు కాలేజీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలియజేశారు. అంతే షాక్‌కు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు.