1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (18:56 IST)

గూడ్సు రైలు ఢీకొని 80 గొర్రెల మృతి

sheeps die
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి సమీపంలో ఆదివారం గూడ్స్‌ రైలు ఢీకొని 80 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
గొర్రెల కాపరి అయిన యజమాని, లక్కం రాజం ఉదయం గొర్రెలను మేత కోసం సమీప ప్రాంతాలకు తోలుకెళ్లాడు. గొర్రెలు కల్వర్టు సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొంది.
 
దాదాపు 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల విలువ దాదాపు రూ.6 లక్షలు. తనకు ఆదాయ వనరులు లేకుండా పోయిందని, నష్టపరిహారం అందించాలని గొర్రెల యజమాని రాజం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.