గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (17:15 IST)

పెళ్లయిన గంటల వ్యవధిలో వరుడు మృతి

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో పెళ్లయిన కొన్ని గంటల వ్యవధిలోనే వరుడు శివకుమార్ దుర్మరణం పాలయ్యారు. 
 
శనివారం తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా వెలుగోడు మండలంలోని మోత్కూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని శివకుమార్‌ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 
 
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే శివకుమార్‌ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.