ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (13:04 IST)

భక్తులపై పంజా విసిరిన మృత్యువు.. ముగ్గురు మృతి

road accident
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భక్తులపై మృత్యువు పంజా విసిరింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికివస్తూ ఈ ప్రమాదానిగి గురయ్యారు. ఫలితంగా ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లి గ్రామానికి చెందిన నవీన్ ఉప్పల్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, లింగాల ఘనాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్, మెట్‌పల్లి మండలం మెట్ల చింతాపూర్ గ్రామానికి చెందిన వినీత్‌లు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. 
 
వీరంతా కలిసి శ్రీ లక్ష్మి నరిసింహా స్వామి దర్శనం కోసం యాదాద్రికి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ ముగ్గురు వస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదానికి గురికావడంతో మృత్యువాతపడ్డారు. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.