గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (10:44 IST)

ఢిల్లీలో అగ్నిప్రమాదం - భారీగా ఆస్తినష్టం

building fire
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఢిల్లీలోని మంగోల్‌పురిలో ఫేజ్-1 ప్రాంతంలో బుధవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. 
 
ఇందులో ఉన్నట్టుండి చెలరేగిన మంటలు ఒక్కసారిగా కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తు పొగలు కమ్ముకున్నాయి. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.