నోట్ల రద్దుతో సామాన్య ప్రజల ఇబ్బంది.. చిల్లరే కావాలి.. జన ధన్ నల్లబాబుల కన్ను..
నోట్ల రద్దుతో సామాన్య జనానికి కష్టాలు తప్పలేదు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచే బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 2 వేల నోటు కన్నా మాకు రూ.100, 50, 20 రూపాయల నోట్లు ఇస్తే ఎం
నోట్ల రద్దుతో సామాన్య జనానికి కష్టాలు తప్పలేదు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచే బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 2 వేల నోటు కన్నా మాకు రూ.100, 50, 20 రూపాయల నోట్లు ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వినియోగదారులు బ్యాంకు అధికారుల వద్ద తెలిపారు. రెండు వేల నోటు తీసుకుని వెళ్తే ఎవరూ చిల్లర ఇవ్వడం లేదని వాళ్ళు వాపోయారు.
తాము కూడా ఎన్నో కష్టాలు పడుతున్నామని చిన్న వ్యాపారులు చెప్పారు. జనమంతా రెండు వేల నోటు తీసుకువచ్చి సరుకు తీసుకుంటే.. వారికి చిల్లర ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మరోవైపు నోట్ల రద్దుతో నల్ల కుబేరులు ధనం దాచుకునేందుకు ప్రధాని ప్రారంభించిన ‘జన్‌ధన్’ ఖాతాలను ఉపయోగించుకుంటున్నారు.
ప్రధాని పిలుపు మేరకు పేద ప్రజలు చాలా మంది జీరో బ్యాలెన్‌సతో జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాతాలను ‘నల్ల’ బాబులు పెద్ద నోట్లను మార్చుకునేందుకు వినియోగిస్తున్నారు. ఒక్కో అకౌంట్‌లోకి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే అందులో 20 నుంచి 30 శాతం సొమ్మును ఖాతాదారులకు అప్పజెపుతున్నారు. ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయగానే వారి సొమ్మును అప్పగిచ్చేస్తానని ఖాతాదారులు మీడియాతో చెప్తున్నారు.