శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:36 IST)

అన్నాడీఎంకేలో చీలిక.. డీఎంకే వ్యూహం.. త్వరలో ఎన్నికలు వస్తాయ్: స్టాలిన్ జోస్యం

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ప్రస్తుత డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. తమిళ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ చెన్నైకి రావొద్దని సూచించిన స్

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ప్రస్తుత డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. తమిళ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ చెన్నైకి రావొద్దని సూచించిన స్టాలిన్.. త్వరలోనే ఎన్నికలు వస్తాయని.. నాయకులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 
 
బుధవారం ఆయన చెన్నైలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమైన స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి గవర్నర్ విద్యాసాగర్ రావు తెరపడేలా సత్వర చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.  అన్నాడీఎంకే పార్టీ చీలిపోయిన కారణంగా ఇరువర్గాల్లో ఎవ్వరూ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని స్టాలిన్ గుర్తు చేశారు. 
 
అందుచేత త్వరలో ఎన్నికలు రావడం ఖాయమని స్టాలిన్ నొక్కిచెప్పారు. ఇందుకోసం డీఎంకేలోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను బట్టే స్టాలిన్ ఇలా మాట్లాడారని రాజకీయ పండితులు అంటున్నారు. త్వరలో అమ్మ పార్టీలో చీలిక ఏర్పడుతుందని వారు కూడా జోస్యం చెప్తున్నారు. దీంతో డీఎంకే పార్టీ లబ్ధిపొందుతుందని తెలిపారు.