శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (08:37 IST)

మత్తు రెండింతలైంది.. వధువు మెడలో దండ వేయబోయి...

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ఏ చిన్నపాటి సంఘటన జరిగినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. చెడు లేదా మంచి లేదా ఫన్నీ సంఘటన ఎలాంటిదైనా సరే సోషల్ మీడియాలో చూడొచ్చు. ఇలాంటి వాటిలో కొన్నింటిని చూస్తే పొట్టచెక్కలయ్యేలా పగలపడి నవ్వుతాం. అలాంటి సంఘటన ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. పీకల వరకు మద్యం సేవించిన వరుడు.. పూలమాలను వధువుకు బదులు మరో మహిళ మెడలో వేయబోయాడు. పక్కనే ఉన్నవారు అది గమనించి అడ్డుకున్నారు. తీరా వధువు మెడలో వేయబోయే సమయానికి కైపు బాగా ఎక్కిపోవడంతో డభేల్‌మని కిందపడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. ఏ అబ్బాయికైనా.. పెళ్లి రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజును చిరస్మరణీయంగా మార్చేందుకు తెగ కసరత్తులు చేస్తుంటారు. అయితే ఈ వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫుల్లుగా తాగి మైకంలోకి వెళ్లిపోయాడు. 
 
దండలు మార్చుకునే సమయం వచ్చింది నిలబడ్డాడు కానీ.. పక్కనున్న మహిళకు దండవేయబోయాడు. గమనించిన ఆమె అడ్డుకుంది. మళ్లీ అంతలోనే తనతప్పును గ్రహించిన ఆ యువకుడు పెళ్లి కూతురుకు దండవేయబోతాడు. దండలు మార్చుకునే సమయానికి అతని మత్తు రెండింతలైంది. చివరకు ఏం జరిగిందో చూస్తే మీరు నవ్వుకుంటారు.