మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (18:03 IST)

కేజ్రీవాల్ కారు డ్రైవర్‌కు ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్.. పదిలక్షలకు చేరిన ఫాలోవర్స్ సంఖ్య!

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కారు డ్రైవర్‌కు వెరిఫైడ్ అకౌంట్ వచ్చేసింది. సాధారణంగా సోషల్ మీడియాలో అనేకమంది ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు. తమ అభిప్రాయాలను ఇతరులను పంచుకోవచ్చు

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కారు డ్రైవర్‌కు వెరిఫైడ్ అకౌంట్ వచ్చేసింది. సాధారణంగా సోషల్ మీడియాలో అనేకమంది ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు. తమ అభిప్రాయాలను ఇతరులను పంచుకోవచ్చు. కానీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి మాధ్యమాల్లో సాధారణ వినియోగదారులకు వెరిఫైడ్‌ అకౌంట్లు ఉండవు.
 
సెలబ్రిటీలు, పేరున్న రాజకీయవేత్తలు, ప్రముఖ సామాజిక కార్యకర్తలకి మాత్రమే వెరిఫైడ్ అకౌంట్లు ఉంటాయి. కానీ కేజ్రీవాల్ డ్రైవర్‌కి మాత్రం ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ ఉంది. రోహిత్ పాండే అనే ఆ వ్యక్తి కేజ్రీవాల్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ట్విట్టర్‌లో రోహిత్‌ జోకులు, అవసరమైన సమాచారంతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీకి సంబంధించిన అన్ని ట్వీట్లను రీట్వీట్‌ చేస్తుంటాడు. 
 
ఇలా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే ఇతని ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య పదివేలకు చేరింది. దాంతో అతనికి వెరిఫైడ్‌ అకౌంట్‌ వచ్చేసింది. అంతేకాదు అతడిని ఫాలో అయ్యేవారిలో కేజ్రీవాల్‌ కూడా ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా రోహిత్ స్పందిస్తూ.. అరవింద్ కేజ్రీవాల్ కారు డ్రైవ్ చేస్తున్నందుకు గర్విస్తున్నానని రాసుంది.